అభ్యర్థుల్లో టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల్లో టెన్షన్‌

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

అభ్యర

అభ్యర్థుల్లో టెన్షన్‌

– IIలోu

మహబూబాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఈమేరకు సిబ్బందికి విధులు కేటాయించారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచే కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. కేంద్రాల ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా,అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

పాఠశాలలో కౌంటింగ్‌..

మానుకోట మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఈదులపూసపల్లి రోడ్డులోని సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. 36 వార్డులు ఉండగా 36 టేబుల్స్‌ ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ రాజేశ్వర్‌ తెలిపారు. ప్రతీ టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్‌లు, ఇతర సిబ్బంది.. ఇలా మొత్తం ఎనిమిది మంది విధులు నిర్వర్తిస్తారు. కౌంటింగ్‌ కోసం 12మంది ఆర్వోలు, 12మంది ఏఆర్వోలు విధులు నిర్వర్తిస్తారు. విజేతలకు నియామక పత్రం కూడా వారి చేతుల మీదుగా ఇవ్వనున్నారు. మొత్తం 360మంది సిబ్బంది కౌంటింగ్‌ విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లకు పాస్‌లు జారీ చేశారు. కౌంటింగ్‌కు నోడల్‌ అధికారిగా ఆర్డీఓ కృష్ణవేణి వ్యవహరించనున్నారు. కమిషనర్‌ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ చంద్ర రాజేశ్వర్‌, ఎంపీడీఓ రఘుపతి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తొర్రూరులో సర్వం సిద్ధం

తొర్రూరు: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాన్ని ఆర్యభట్ట హైస్కూల్‌లో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 16 వార్డులకు గాను 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో టేబుల్‌కు ఒక ఆర్‌ఓ, ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సిబ్బందితో పాటు మరొకరిని అదనంగా ఏర్పాటు చేశారు. అధికారులు స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సులను పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో తెరవనున్నారు. 16 వార్డులకు గాను 63 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వారి భవితవ్యం నేడు తేలనుంది. ఆర్యభట్ట పాఠశాలలోని లెక్కింపు కేంద్రాన్ని ఆర్డీఓ గణేశ్‌ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌ తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీఐ గణేష్‌, ఎస్సైలు ఉపేందర్‌, రాజు పాల్గొన్నారు.

మరిపెడలో ఏర్పాట్లు..

మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్‌ ఆగస్టీన్‌ పాఠశాలలో గురువారం ఓట్ల కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 25 పోలింగ్‌ కేంద్రాల నుంచి సేకరించిన బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను శుక్రవారం లెక్కించనున్నారు.

నేడు మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి

ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం

సెంటర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు..

డోర్నకల్‌: మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం గురువారం స్థానిక నిర్మలా హైస్కూల్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో 15 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఐదుగురు ఆర్వోలు, ఒక అబ్జర్వర్‌, 45మంది సిబ్బంది, టీ పోల్‌ కోసం ఒకరు, వెబ్‌ కాస్టింగ్‌ కోసం ఒకరు, ఎనిమిది మంది రిజర్వ్‌ సిబ్బంది శుక్రవారం ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించనున్నారు. స్ట్రాంగ్‌రూం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా..

కేసముద్రం: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గురువారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 16 వార్డులకు గాను 16 కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక్కో కౌంటరుకు ఆర్వో, ఏఆర్‌ఓ, ముగ్గురు లెక్కింపు అధికారులను నియమించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు కారణంగా ప్రధాన రహదారి మీదుగా వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించినట్లు ఎస్సై క్రాంతికుమార్‌ తెలిపారు. జ్యోతిరావు పూలే సెంటర్‌ నుంచి కట్టు కాలువ తండా మీదుగా అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి వాహనాలు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సై తెలిపారు.

అభ్యర్థుల్లో టెన్షన్‌1
1/3

అభ్యర్థుల్లో టెన్షన్‌

అభ్యర్థుల్లో టెన్షన్‌2
2/3

అభ్యర్థుల్లో టెన్షన్‌

అభ్యర్థుల్లో టెన్షన్‌3
3/3

అభ్యర్థుల్లో టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement