ప్రచార పదనిసలు
● చిన్నారి చేతిలో పోస్టర్లు..
పోలీసుల అదుపులో బైక్ దొంగలు?
సంగెం: సంగెం పోలీసుల అదుపులో బైక్ దొంగలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 1వ తేదీన మండలంలోని కాపులకనిపర్తికి చెందిన నల్లతీగల ఉమాకర్ బైక్‌ను దొంగలు అపహరించుకెళ్లారు. దీంతో బాధితుడు 2వ తేదీన పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బైక్ కోసం గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ బైక్‌తో పాటు మరో పదికి పైగా ద్విచక్రవాహనాలను పట్టుకుని సుమారు 15 మందికి పైగా దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఒక బైక్ కోసం తీగ లాగితే డొంక కదిలినట్లు బైక్ దొంగల ముఠానే పట్టుబడినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటుపడిన వారిని పావులుగా వాడుకుంటూ ఖర్చుల కోసం రూ 2వేలు ఇస్తూ చోరీలు చేయిస్తున్నట్లు సమాచా రం. ఇలా ఇప్పటికే 20కి ౖపైగా బైక్‌ల ఆచూకీ లభించాయని, మరిన్ని లభించే అవకాశం ఉందని తెలిసింది. కాగా, పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
చిన్నారిపై లైంగిక దాడి
● ఇద్దరు యువకులపై పోక్సో కేసు
రేగొండ: చిన్నారిపై ఇద్దరు యువకులు లైంగికదాడి చేసిన అవమానవీయ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఓ చిన్నారి (8) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గణేశ్ అనే యువకుడు లైంగిక దాడి చేశాడు. అదేవిషయం వరుసకు సోదరుడైన శ్రీకాంత్‌కు చెప్పాడు. ఆదివారం చిన్నారి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో శ్రీకాంత్ సైతం చిన్నారిపై లైంగికదాడి చేసినట్లు తెలిపారు. కాగా, సాయంత్రం అస్వస్థతకు గురైన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా లైంగికదాడి విషయం బయటపడింది. పోలీస్‌స్టేషన్‌లో చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రేగొండ ఎస్సై రాజేశ్ తెలిపారు.
ఖిలా వరంగల్: వరంగల్ కరీమాబాద్‌లోని నానామియ తోటలో రామగిరి ప్రతాప్ తన ఇంటి ఎదుట పార్క్ చేసిన పల్సర్ బైక్ చోరీకి గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. రోజువారీగానే ఈనెల 4న ప్రతాప్ తన ఇంటి ఎదుట బైక్ పార్క్ చేసి రాత్రి నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు ఉదయాన్నే చూసేసరికి బైక్ కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు.
ప్రచార పదనిసలు


