బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు | - | Sakshi
Sakshi News home page

బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు

Feb 14 2026 9:05 AM | Updated on Feb 14 2026 9:05 AM

బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు

బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు

ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్‌హాల్‌నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, శ్రీనివాస్‌ మొదటినుంచి కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు.

– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్‌, హన్మకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement