మోదీ విధానాలతో తీవ్ర నష్టం
● కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
సార్వత్రిక సమ్మె నిర్వహణ
నెహ్రూసెంటర్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికుల హక్కులు, చట్టాలకు తీవ్రనష్టం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకుడు రేషపల్లి నవీన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు హలావత్ లింగన్న, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో కార్మిక నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌ల అమలుతో 40 లక్షల మంది అసంఘటిత కార్మికులు, కార్మిక కుటుంబాలు చితికిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, లేబర్‌కోడ్‌లను రద్దు చేసి 29 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుజ్జు దేవేందర్, బండపల్లి వెంకటేశ్వర్లు, నాగన్న, పర్వత కోటేష్, గునిగంటి రాజన్న, అల్వాల వీరయ్య, మేక వీరన్న, బూర్గుల మోష, మధు, కవిత, సులోచన, సరిత, కోటేశ్వర్‌రావు, జబ్బార్, మధు, శ్రీనివాస్, లింగయ్య, చెక్కల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


