ఓటేసేందుకు 18 కార్డులు | - | Sakshi
Sakshi News home page

ఓటేసేందుకు 18 కార్డులు

Feb 11 2026 8:13 AM | Updated on Feb 11 2026 8:13 AM

ఓటేసేందుకు 18 కార్డులు

ఓటేసేందుకు 18 కార్డులు

పద్దెనిమిది కార్డులివీ..

ఏదో ఒక్క కార్డు ఉంటే చాలు..

ఎంచక్కా ఓటు వేసి రావచ్చు

నేడే మున్సిపల్‌ ఎన్నికలు

ఓటు ఇలా వేద్దాం..

● పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లగానే మొదటి అధికారి వద్ద ఫొటోచిట్టీ, లేదా ఏదైనా గుర్తింపు కార్డును చూపించాలి. ఆ అధికారి తమ వద్ద ఉన్న ఓటరు జాబితాలో పేరు చూసి, వరుస క్రమసంఖ్యను, పేరును బహిరంగ పరుస్తారు.

● పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లు మిమ్మల్ని పోల్చుకుంటారు. మీరు నిజంగానే ఆ ఓటరేనా... నకిలీ ఓటరా? అని సరిచూసుకుంటారు. ఓటరు జాబితాలో మీ పేరును రౌండప్‌ చేస్తారు. రెండో అధికారి మీ వేలిపై సిరాచుక్క రాస్తారు. మూడో అధికారి బ్యాలెట్‌పత్రాల బుక్‌పై మీ సంతకం తీసుకుంటారు. చదువు రాని వారైతే.. వేలిముద్ర వేయిస్తారు.

● ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి మీకు బ్యాలెట్‌పత్రం ఇస్తారు. ఓటు వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లి ఓటు వేయాలి.

● ప్రతి ఓటరు బ్యాలెట్‌పత్రంలోని గుర్తుపై స్వస్తిక్‌ గుర్తు ఉన్న ఇంక్‌స్టాంప్‌తో ముద్ర వేయాలి. బ్యాలెట్‌ పత్రాన్ని మలిచి బ్యాలెట్‌ బ్యాక్స్‌ల్లో వేయాలి.

బాధ్యతలు మరువద్దు..

చలి ఉందని, మధ్యాహ్నం ఎండలు ఉన్నాయని, సెలవు దొరికిందని, దూరభారమని ఓటు వేయడం మరిచిపోవద్దు. పౌరులుగా మీ బాధ్యతలను మరిచిపోవద్దు. మీకు వీలున్నప్పుడే వెళ్లి పోలింగ్‌ రోజు ఓటు వేయాలి. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేకుంటే ‘నోటా’కు ఓటు వేయవచ్చు.

ఇవి చేయొద్దు..

పోలింగ్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దు. ఎన్నికల సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలకు గురవుతారు. క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు సైగలు చేయడం, ప్రచారం చేయడం తప్పు. పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే ప్రచారం చేసుకోవాలి. పోలింగ్‌ కేంద్రం వద్ద చెత్తవేయడం, ఉమ్మి వేయడం చేయొద్దు.

ఓటరు గుర్తింపు కార్డు ఉండి..

పోలింగ్‌ కేంద్రం తెలియకుంటే..

ఓటరు గుర్తింపు కార్డు ఉంది. పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలియకుంటే.. ఏ వార్డులో ఓటుహక్కు ఉందో అర్థం కాకపోతే.. మున్సిపల్‌ ఆఫీస్‌లోని పౌరసేవా కేంద్రంలోకి వెళ్లి ఆన్‌లైన్‌లో ఓటరు కార్డు నంబరు ఆధారంగా చెక్‌ చేసి తెలుసుకోవచ్చు.

– వరంగల్‌ డెస్క్‌

ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌,పాన్‌కార్డు, ఎన్‌పీఆర్‌ కింద ఆర్‌జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు

పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఉపాధిహామీ

జాబ్‌కార్డు, ఫొటోతో ఉన్న పెన్షన్‌పత్రం

ఫొటోతో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికెట్‌,ఫొటోతో కూడిన దివ్యాంగుల సర్టిఫికెట్‌.

ఫొటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసినకార్డులు

బ్యాంకు, లేదా పోస్టాఫీస్‌ జారీచేసిన

ఫొటో ఉన్న పాస్‌పుస్తకం

ఫొటోతో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపుకార్డు

లేబర్‌ మంత్రిత్వశాఖ జారీచేసిన

ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు

ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేదా ఎమ్మెల్సీలకు జారీచేసిన గుర్తింపు కార్డులు

ఓటేయడం.. మన హక్కు. అంతకుమించి బాధ్యత. రానున్న ఐదేళ్లపాటు మన పట్టణాన్ని పాలించేది ఎవరో నిర్ణయించేది మనమే. అంతటి శక్తి ఉన్న ఓటరు తన ఓటుతో నాయకుడిని ఎన్నుకునే సమయం వచ్చింది. నేడు (బుధవారం) మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటు వేసేందుకు వెళ్తుండగా ఓటరు గుర్తింపుకార్డు దొరకడం లేదని.. మా ఇంటికి ఫొటోతో కూడిన పోల్‌చిట్టీ రాలేదనే కారణాలతో ఓటు వేయకపోవడం సరికాదు. నిర్లక్ష్యం వీడితే చాలు.. ఓటరు జాబితాలో పేరు ఉండి.. 18 రకాల గుర్తింపుకార్డులలో ఏదేని ఒకటి ఉంటే ఓటు వేయవచ్చని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మున్సిపల్‌ అధికారులు జారీ చేసిన పోల్‌చిట్టీతోపాటు గుర్తింపుకార్డులు తప్పనిసరి. పోల్‌ చిట్టీ ఉండి, గుర్తింపుకార్డు లేకుంటే ఓటు వేయనివ్వరు. గుర్తింపు కార్డు ఉండి, పోల్‌ చిట్టీ లేకున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నేడు మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు అవరసమైన ఫొటో గుర్తింపుకార్డుల గురించి తెలుసుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement