రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కురవి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన శనివారం రాత్రి సీరోలు పీఎస్ పరిధిలోని చింతపల్లి శివారులో 365 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సాధు శ్రీను(47) బైక్‌పై మరిపెడ నుంచి కురవి వైపునకు వస్తున్నాడు. ఇదే సమయంలో చింతపల్లి నుంచి ఇదే గ్రామంలో ఉన్న క్రషర్ మిల్లు వైపునకు నడుచుకుంటూ నలుగురు కూలీలు వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీను వెనుక నుంచి సునీల్ ఢీకొన్నాడు. దీంతో సునీల్ స్వల్ప గాయాలయ్యాయి. అలాగే, బైక్ కిందపడడంతో శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీను మృతి చెందాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ ఆదివారం తెలిపారు.
లారీ కింద పడి కాటారంలో యువకుడు..
మల్హర్(కాటారం): లారీ కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాటారం ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండంలోని ఇప్పలపల్లికి చెందిన ఆత్మకూరి రాజయ్య(35) ఎరువులు కొనడానికి గారెపల్లికి వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో తాడిచర్ల నుంచి భూపాలపల్లి వెళ్తున్న బొగ్గు టిప్పర్ తగిలి టైర్ల కింద పడడంతో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై భార్య దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
● చింతపల్లి శివారులో ఘటన


