సామాజిక న్యాయం కోసం పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయం కోసం పోరాడాలి

Feb 15 2026 9:39 AM | Updated on Feb 15 2026 9:39 AM

సామాజిక న్యాయం కోసం పోరాడాలి

సామాజిక న్యాయం కోసం పోరాడాలి

ఐనవోలు : అరాచకాలను ఎదిరించిన పరాక్రమశాలి సర్వాయి పాపన్న గౌడ్‌ స్ఫూర్తితో బహుజనులు సామాజిక న్యాయసాధన కోసం పోరాడాలని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పల్లె రవికుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పున్నేలు గ్రామంలో శ్రీకంఠమహేశ్వర గౌడ సంఘం ఆధ్వర్యంలో పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. పల్లె రవికుమార్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాపన్న స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని లక్ష్యం సిద్ధించే వరకూ రాజీలేని పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ సర్వాయి పాపన్న ఆచరణలో చూపిన సిద్ధాంతమే తెలంగాణ సామాజిక న్యాయసాధనకు సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. బంతి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు మోతె చక్రవర్తి, అంజయ్య, గడ్డం ర ఘువంశీ, చిర్ర రాజు, గోపి, రామ్మూర్తి, భిక్షపతి, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పల్లె రవికుమార్‌ గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement