డీసీఓ ఇష్టం వచ్చినట్లు కొట్టారు.. తిట్టారు | - | Sakshi
Sakshi News home page

డీసీఓ ఇష్టం వచ్చినట్లు కొట్టారు.. తిట్టారు

Feb 11 2026 8:13 AM | Updated on Feb 11 2026 8:13 AM

డీసీఓ ఇష్టం వచ్చినట్లు కొట్టారు.. తిట్టారు

డీసీఓ ఇష్టం వచ్చినట్లు కొట్టారు.. తిట్టారు

కాజీపేట అర్బన్‌ : తమను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతోపాటు కాలితో తన్ని అసభ్యకరంగా మాట్లాడిన డీసీఓను వెంటనే సస్పెండ్‌ చేయాలని మడికొండలోని సోషల్‌ వెల్ఫేర్‌ గర్ల్స్‌ స్కూల్‌, జానియర్‌ కళాశాల విద్యార్థినులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం మండికొండ సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేపట్టారు. విద్యార్థుల కథనం ప్రకారం.. మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 160 మంది విద్యార్థినులు ఇంటర్‌ ఫస్ట్‌, సెకండియర్‌ చదువుతున్నారు. ఈ క్రమంలో 11 మంది ఫస్టియర్‌ విద్యార్థినులు తరగతి గదులకు ఆలస్యంగా వచ్చారని సోమవారం కళాశాల డీసీఓ, ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వరి విచక్షణ కో ల్పోయి తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా కాలితో తన్ని దుర్భాషలాడారు. ఈ ఘటనను కలెక్టర్‌ స్నేహ శబరీష్‌కు తెలిపేందుకు మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో సుమారు 120 మంది విద్యార్థినులు స్కూల్‌ నుంచి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న మడికొండ ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్‌.. విద్యార్థినులను దారిలో ఆపగా వారు మడికొండ సబ్‌స్టేషన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. డీసీఓను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు సోషల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ కార్యాలయానికి సమాచారం అందజేయగా జోనల్‌ అధికారులు అపర్ణ, అరుణకుమారి ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలుపడంతో విద్యార్థినులు కళాశాలకు చేరుకున్నారు.

కలెక్టర్‌కు నివేదిక అందజేత..

మడికొండ గురుకుల కళాశాల విద్యార్థినులు ధర్నా చేపట్టడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎస్సీ డెవలప్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నిర్మల, కాజీపేట తహసీల్దార్‌ రాజు, ఇన్‌చార్జ్‌ సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి విశ్వజ.. కళాశాలకు చేరుకున్నారు. 11 మంది విద్యార్థునుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నివేదికను మంగళవారం కలెక్టర్‌కు అందజేశారు.

ఈ ఘటనలో ఆమెను సస్పెండ్‌ చేయాలి

సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ విద్యార్థినుల డిమాండ్‌

మడికొండ సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement