సేవాలాల్ మహరాజ్ మార్గం అనుసరణీయం
● భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలు
మహబూబాబాద్ రూరల్ : బంజారాల ఆరాధ్య దైవం గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం యువతకు ఆదర్శమని శనిగపురం సేవాలాల్ ఆలయ కమిటీ చైర్మన్, సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ వెంకన్ననాయక్ అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను సేవాలాల్ సేన, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహబుబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం ఆలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. భోగ్ బండారో, లాగ భోగ్ కట రోగ్, బంజారా సంప్రదాయ నృత్యాలతో నిర్వహించారు. ఈసందర్భంగా వెంకన్ననాయక్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా భక్తి మార్గంలో ఉండాలని సూచించారు. సేవాలాల్ జయంతికి నిధులు కేటాయించాలని, బంజారా సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నెహ్రూరాథోడ్, కర్నావత్ వెంకన్న, మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూనాయక్, డాక్టర్ కిరణ్ నాయక్, గుగులోత్ హాల్యానాయక్, గుగులోతు కిషన్ నాయక్, ధరావత్ భాస్కర్, రాంజీనాయక్, ధరావత్ మోతిలాల్ నాయక్, స్రవంతి బాయి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామ శివారులోని సేవాలాల్ మహరాజ్ దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో నిర్వహించిన జ యంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ హాజరై భోగ్ బండారో సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో గుగులోత్ భీమానాయక్, రామచందర్, ధరావత్ బాలునాయక్, బానోతు దా ము, నవీన్, భూక్యా సురేందర్, మల్సూర్, వీరన్న, కిషన్, వెంకన్న, రాజునాయక్ పాల్గొన్నారు.


