వెలమలకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి
హన్మకొండ: అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నడిపెల్లి వెంటేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని ఏకశిల పార్కు వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌కు వరకు ర్యాలీగా చేరుకుని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి.. వెలమ కులాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం తగదన్నారు. వెలమ జాతి మనస్సును గాయపరిచిన సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కాకులమర్రి ప్రవీణ్‌కుమార్, కోశాధికారి సిద్దూరి స్వామి రావు, ప్రతినిధులు బాలచందర్ రావు, తక్కళ్లపల్లి శ్యాంసుందర్ రావు, విద్యాసాగర్ రావు, పిన్నింటి వెంకటేశ్వరరావు, గుజ్జ గోపాల్ రావు, తక్కళ్లపల్లి అమృత రావు, తక్కళ్లపల్లి బుచ్చిబాబు రావు, మట్టపల్లి సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.


