పోలీసుల విస్తృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల విస్తృత తనిఖీలు

Feb 11 2026 8:14 AM | Updated on Feb 11 2026 8:14 AM

పోలీసుల విస్తృత తనిఖీలు

పోలీసుల విస్తృత తనిఖీలు

మహబూబాబాద్‌ రూరల్‌ : మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జ రగకుండా మహబూబాబాద్‌ పట్టణ పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్ల వారుజాము వరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ శబరీష్‌, డీఎస్పీ తిరుపతిరావు ఆదేశాల మేరకు టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్‌ ఎస్సై షాకీర్‌, పోలీసు సిబ్బంది మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గస్తీ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులతో మాట్లాడి వివాదాస్పద అంశాల్లో తలదూర్చొద్దని సూచించారు. శాంతియుత వాతావరణంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిగేందుకు పట్టణ ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులూ సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement