గిరిజన ఆవాసాలకు సర్వీస్‌లు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన ఆవాసాలకు సర్వీస్‌లు త్వరగా పూర్తి చేయాలి

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

గిరిజన ఆవాసాలకు సర్వీస్‌లు త్వరగా పూర్తి చేయాలి

గిరిజన ఆవాసాలకు సర్వీస్‌లు త్వరగా పూర్తి చేయాలి

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 17 సర్కిళ్లలో ప్రధాన మంత్రి జన్‌జాతీయ ఉన్నత్‌ గ్రామ అభియాన్‌ పథకం కింద గిరిజన ఆవాసాల విద్యుద్దీకరణకు సంబంధించి అన్ని సర్వీస్‌ల మంజూరు పనులు మార్చి 31లోపు పూర్తి చేయాలని సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండలోని విద్యుత్‌ భవన్‌ కార్పొరేట్‌ కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు, డివిజనల్‌ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు వెంటనే మీటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారలకు గృహజ్యోతి పథకం ప్రయోజనం చేకూరే చర్యలు తీసుకోవాలన్నారు. మిగతా పనులు వేగవంతంగా పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. సీఈలు సురేందర్‌, శ్రవణ్‌ కుమార్‌, జీఎంలు శ్రీనివాస్‌, నాగప్రసాద్‌, శ్రీకాంత్‌, డీఈలు ప్రభావతి, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ

కర్నాటి వరుణ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement