ప్రశ్నించే గొంతుక సీపీఐ అభ్యర్థులను గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే గొంతుక సీపీఐ అభ్యర్థులను గెలిపించాలి

Feb 10 2026 7:58 AM | Updated on Feb 10 2026 7:58 AM

ప్రశ్నించే గొంతుక సీపీఐ అభ్యర్థులను గెలిపించాలి

ప్రశ్నించే గొంతుక సీపీఐ అభ్యర్థులను గెలిపించాలి

పార్టీ జాతీయ నేత కె.నారాయణ

నెహ్రూసెంటర్‌ : ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక సీపీఐ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ జాతీయ నేత డాక్టర్‌ కె.నారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం సీపీఐని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మానుకోటలో కమీషన్లు, భూ కబ్జాలకు ఎమ్మెల్యే మురళీనాయక్‌ తెరలేపారని ఆరోపించారు. మున్సిపాలిటీ పాలకవర్గం రాకముందే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి కమీషన్లు దండుకున్నాడని ఆరోపించారు. కబ్జాలు చేసేందుకు పైరవీలు ప్రారంభించారని, కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బి.అజయ్‌సారథిరెడ్డి, పంజాల రమేశ్‌, పెరుగు కుమార్‌, రేషపల్లి నవీన్‌, చింతకుంట్ల శ్రీదేవివెంకన్న, ఎండి.ఫాతిమా, నర్ర సంధ్యాశ్రావణ్‌, నాగెల్లి యాకమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement