ఉద్యమాల మానుకోట | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాల మానుకోట

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

ఉద్యమ

ఉద్యమాల మానుకోట

సాక్షి, మహబూబాబాద్‌: ‘అటు ఓరుగల్లు.. ఇటు ఖమ్మం మెట్టు.. రెండింటికీ మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న మానుకోట అనేక ఉద్యమాలు, పోరా టాలకు సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలకు నెలవుగా విరాజిల్లింది. ఇదే క్రమంలో కాలానుగుణంగా వచ్చిన రాజకీయ, సామాజిక మార్పులతో గ్రామం నుంచి పట్టణంగా.. పంచాయతీగా ఆ తర్వాత పట్టణం నుంచి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన మహబూబాబాద్‌లో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల వేడి మొదలైంది.

నిజాం కాలంలోనే తాలూకా.. .

పురాతన చరిత్ర కలిగిన మానుకోట ప్రాంతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే తాలూకాగా కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్స్‌ టౌన్‌ మున్సిపాలిటీగా ఏర్పడింది. తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1964లో తిరిగి గ్రామ పంచాయతీగా మారింది. వరంగల్‌ జిల్లాలోనే మేజర్‌ గ్రామ పంచాయతీగా కొనసాగిన మానుకోట పంచాయతీ 2011లో తిరిగి మున్సిపాలిటీగా మారింది.

మారిన మానుకోట స్వరూపం..

తాలూకా కేంద్రంగా ఉంటూ.. చుట్టూరా వంద గ్రామాలకు కేంద్రంగా ఉన్న మానుకోట.. కాలానుగుణ మార్పులతో మహబూబాబాద్‌గా ఆవిర్భవించింది. సుమారు వెయ్యి జనాభాగా ఉన్న చిన్న గ్రామం నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం 65,712 మంది ఓటర్లు, లక్షకు పైగా జనాభాతో 36 వార్డులకు చేరింది. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా 18 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో మహబూబాబాద్‌ కేంద్రంగా జిల్లా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగం మొదలైన కారణాలతో.. గడిచిన పదేళ్లలో మహబూబాబాద్‌ రెట్టింపుగా విస్తరించింది.

పంచాయతీ సర్పంచ్‌లు..

సంవత్సరం సర్పంచ్‌ పేరు

1964– 1970 కల్వల గోపాల్‌రావు

19971– 1981 లక్ష్మీనారాయణ(న్యాయవాది)

1981– 1995 గన్‌ శ్యాందాస్‌ ఝవార్‌

1995– 2001 సాదుల శ్రీనివాస్‌

2001– 2006 మలిగిరెడ్డి సుధాఅర్జున్‌రెడ్డి

2007– 2011 భూక్యా నెహ్రూనాయక్‌

మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత

సంవత్సరం మున్సిపల్‌ చైర్మన్‌

2014– 2019 భూక్య ఉమా మురళీనాయక్‌

2020– 2025 పాల్వాయి రాంమోహన్‌ రెడ్డి

స్వాతంత్య్ర కాలంలోనే తాలూకా

మొదటి నుంచి చారిత్రక

ప్రాంతంగా ఖ్యాతి

ఉద్యమాల మానుకోట1
1/7

ఉద్యమాల మానుకోట

ఉద్యమాల మానుకోట2
2/7

ఉద్యమాల మానుకోట

ఉద్యమాల మానుకోట3
3/7

ఉద్యమాల మానుకోట

ఉద్యమాల మానుకోట4
4/7

ఉద్యమాల మానుకోట

ఉద్యమాల మానుకోట5
5/7

ఉద్యమాల మానుకోట

ఉద్యమాల మానుకోట6
6/7

ఉద్యమాల మానుకోట

ఉద్యమాల మానుకోట7
7/7

ఉద్యమాల మానుకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement