సోమన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సోమన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

Feb 8 2026 4:20 AM | Updated on Feb 8 2026 4:20 AM

సోమన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

సోమన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. జాతరలో గుట్ట పరిసర ప్రాంతంలో అదనంగా 100 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని, 15న జరగనున్న స్వామివారి కల్యాణ మహోత్సవానికి నిరంతరం విద్యుత్‌ ఉండేలా చూడాలన్నారు. ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ జాతర నిర్వహణకు 200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయినున్నట్లు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణకు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల నుంచి సిబ్బందిని నియమిస్తామని డీఎల్‌పీఓ వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం జాతర వాల్‌పోస్టర్లను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్డీఓ డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్‌ సరస్వతి, ఎండీపీఓ వేదవతి, ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏడీఈ శ్రీధర్‌రావు, ఏఈ రణధీర్‌, ఆర్టీసీ వరంగల్‌ –1 డిపో మేనేజర్‌ అర్పిత, సీఐ జానకీరాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ అశోక్‌కుమార్‌, ఎకై ్సజ్‌ సీఐ సంతోష్‌రెడ్డి, ఎస్సై పవన్‌కుమార్‌, డాక్టర్‌ ఉష, అగ్నిమాపక అధికారి శ్రీరాములు, ఆర్‌అండ్‌బీ డీఈ కరుణాకర్‌, ఏఈ సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement