అధికారులు సమన్వయంతో పని చేయాలి
● ఆర్డీఓ కృష్ణవేణి
మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఈనెల 14నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు పూర్తిస్థాయిలో విధులు నిర్విర్తించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ, డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


