టఫ్‌ ఫైట్‌! | - | Sakshi
Sakshi News home page

టఫ్‌ ఫైట్‌!

Feb 14 2026 7:22 AM | Updated on Feb 14 2026 7:22 AM

టఫ్‌

టఫ్‌ ఫైట్‌!

సాక్షి, మహబూబాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీలను కై వసం చేసుకోగా.. తొర్రూరులో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆధిక్యం దక్కింది. అయితే మహబూబాబాద్‌, కేసముద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు సరైన మెజార్జీ రాకపోవడంతో చైర్మన్‌ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్‌ పాగా..

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి మరిపెడ, డోర్నకల్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ పోటాపోటీగా ప్రచారం చేశారు. కాగా, మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా.. కాంగ్రెస్‌ ఎనిమిది వార్డులు, బీఆర్‌ఎస్‌ ఆరు వార్డులు, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అదేవిధంగా డోర్నకల్‌ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. కాంగ్రెస్‌ 11వార్డులు, బీఆర్‌ఎస్‌ 4వార్డులు గెలుపొందాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి చైర్మన్‌ పీఠం దక్కుతుంది.

ముందు నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో చివరకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అధిక స్థానాలు గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీపీసీ నాయకురాలు ఝాన్సీ రెడ్డితోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రచారం చేశారు. గతంలో ఉన్న వర్గాలను సమన్వయం చేసి ఒక్కతాటిపై తీసుకువచ్చా రు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన నాటి నుంచి మళ్లీ ఆధిక్యతను చూపాలని ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రచారానికి కేటీఆర్‌ను పిలిచి జోష్‌ నింపారు. 16 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తొమ్మిది మంది గెలుపొందగా.. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏడుగురు మాత్రమే గెలిచి వెనుకబడ్డారు. దీంతో తొర్రూరు ము న్సిపల్‌ పీఠం బీఆర్‌ఎస్‌కు దక్కనుంది.

జిల్లాలోని డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీలు హస్తగతం

బీఆర్‌ఎస్‌ ఖాతాలోకి

తొర్రూరు మున్సిపాలిటీ

కేసముద్రం, మానుకోటలో చైర్మన్‌ ఎంపికపై ఉత్కంఠ

క్యాంపు రాజకీయాలు,

ఎక్స్‌అఫీషియా ఓట్లపై లెక్కలు

టఫ్‌ ఫైట్‌!1
1/2

టఫ్‌ ఫైట్‌!

టఫ్‌ ఫైట్‌!2
2/2

టఫ్‌ ఫైట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement