పాఠ్యప్రణాళికల్లో విస్తృత మార్పులు చేయాలి
కేయూ క్యాంపస్: వివిధ కోర్సుల పాఠ్యప్రణాళికల్లో విస్తృత మార్పులు చేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూలో బోధన, పరిశోధనల నాణ్యతను మరింతగా మెరుగు పరిచేందుకు ఆ దిశగా పాఠ్యప్రణాళికలో విస్తృత సమకాలీన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం యూనివర్సిటీలోని అకడమిక్ కమిటీ హాల్‌లో సైన్స్ విభాగాల అధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, సైన్స్ విభాగాల డీన్లతో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం పెంపొందించాలన్నారు. అందుకనుగుణంగా సమాజ అవసరాలకు ఉపయోగపడేలా వివిధ కోర్సుల్లో సిలబస్‌ను మార్చాలన్నారు. 2026–2027 విద్యాసంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చేలా పాఠ్యప్రణాళికలను పునఃసిద్ధం చేయాలని ఆయా విభాగాల అధిపతులను ఆదేశించారు. సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఐక్యూఏసీ డైరెక్టర్ ఎస్. నర్సింహాచారి, ‘అకుట్’ అధ్యక్షుడు ప్రొఫెసర్ బి. వెంకట్రామ్‌రెడ్డి, స్టూడెంట్స్ ఆపైర్స్ డీన్ విభాగం మామిడాల ఇస్తారి పాల్గొన్నారు.
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి


