షార్ట్ సర్క్యూట్‌తో డయాగ్నొస్టిక్స్ దగ్ధం
● రూ.3లక్షల నష్టం
హన్మకొండ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో డయాగ్నొస్టిక్స్ దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం ఉదయం హనుమకొండలోని భవానీనగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భవానీనగర్‌లోని ఏ టు జెడ్ డయాగ్నొస్టక్స్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోమంటలు చె లరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపకశాఖ ఆఫీసర్ పి.దిలీప్ కుమార్, లీడింగ్ ఫైర్ ఫైటర్ పి.మహేశ్వర్, సిబ్బంది జి.వినోద్, గౌతంకుమార్ వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో ఏ టు జెడ్ డయాగ్నొస్టిక్స్‌కు రూ.3లక్షల వర కు నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. వాహనదారులు వాహనాలు నిలిపి ప్రమాదాన్ని చూస్తుండడంతో భవానీనగర్ వద్ద ఎన్జీవోస్ కాలనీ రోడ్డులో ట్రాఫిక్ జామ్ జరిగింది. దీంతో కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ కు మార్ సిబ్బందితో చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.


