కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
● పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క
ములుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ములుగు మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతీ పేద కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. ములుగుకు మున్సిపాలిటీ హోదా కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ములుగులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తూ ములుగు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు వంగ సుమలత రవియాదవ్, యాసం వసంత రవికుమార్, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, గండ్రకోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


