లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులకు నష్టం కలిగే అనేక చర్యలు చేపడుతోంది. అందుకే వ్యవసాయ, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు పోరాడాలి.
–బొట్ల చక్రపాణి,
సీఐటీయూ జిల్లా కోశాధికారి
సమ్మెను జయప్రదం చేయాలి
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. కార్మిక సంఘాలు, చట్టాలు లేని దేశంగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. అందుకే పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి.
–తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు,
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక
విధానాలపైఉద్యమించాలి
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఈనెల 12న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పాల్గొనేందుకు అంతా సిద్ధం చేస్తున్నాం. కేంద్రం ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇస్తున్న ప్రాధాన్యం దేశ కార్మిక వర్గం, రైతాంగానికి ఇవ్వడం లేదు.
–గంగుల దయాకర్, ఐఎఫ్‌టీయూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి


