గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

హసన్‌పర్తి: బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి యాదవనగర్‌ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. హైదరాబాద్‌లోని హఫీజ్‌ బాబానగర్‌, కంచన్‌ బాగ్‌, బండ్లగూడకు చెందిన మహ్మద్‌ మస్తాన్‌(18), హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన సోనూ అలియాస్‌ అనిల్‌(23)లతోపాటు మరో 13 మంది యువకులు వరంగల్‌ నగరంలో పైనాపిల్‌ వ్యాపారం చేస్తూ చింతగట్టు క్యాంప్‌ సమీపంలో డేరా వేసుకున్నారు. ఈనెల 3వ తేదీన మస్తాన్‌, సోనూతోపాటు రమేష్‌ పండ్ల వ్యర్థాలను పడేసేందుకు యాదవనగర్‌ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ కట్టకు చేరుకున్నారు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకునేక్రమంలో సోనూ, మస్తాన్‌ కాల్వలో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో మస్తాన్‌ మృతదేహాన్ని వరంగల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద, సోనూ మృతదేహాన్ని నెక్కొండలోని ఎస్సారెస్పీలో కనుకొన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement