ఓటింగ్‌ సరళి పరిశీలన.. | - | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌ సరళి పరిశీలన..

Feb 12 2026 11:25 AM | Updated on Feb 12 2026 11:25 AM

ఓటింగ్‌ సరళి పరిశీలన..

ఓటింగ్‌ సరళి పరిశీలన..

కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 16 వార్డుల్లో 86.14 శాతం పోలింగ్‌ నమోదైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 3వ వార్డులో అత్యధికంగా 94.90, అలాగే 13వ వార్డులో అత్యల్పంగా 81.39 శాతం ఓటింగ్‌ నమోదైంది. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు తమ కుటుంబ సభ్యులతో కేసముద్రం స్టేషన్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కుమారులు క్రిష్టభార్గవ్‌, క్రిష్ణకీర్తన్‌ 15వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధనసరిలో పోలింగ్‌ సరళిని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు ఉమా పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement