రేపు కాజీపేట మీదుగా వన్‌వే స్పెషల్ ట్రైన్
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా అజాంఘర్–యశ్వంత్‌పూర్ వన్‌వే స్పెషల్ ట్రైన్ నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
వన్‌వే స్పెషల్ ట్రైన్ వివరాలు..
ఈనెల 11(నేడు)న అజాంఘర్‌లో బయలుదేరే అజాంఘర్–యశ్వంత్‌పూర్ (05009) స్పెషల్ ట్రైన్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్ చేరుకుని వెళ్తుంది. ఈ ప్రత్యేక రైలుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్షా, సిర్పూర్‌కాగజ్‌నగర్, కాజీపేట, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు.
పారా సిట్టింగ్ వాలీబాల్ రాష్ట్ర జట్టు ఎంపిక
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పారా సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టును మంగళవారం ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 60 మంది పారా క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా క్రీడాకారుల శారీరక సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, ఆటపై అవగాహన, జట్టు సమన్వయం, క్రమశిక్షణ ఆధారంగా సెలక్షన్ కమిటీ తుది జట్టు ఎంపిక చేసిందని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు సింగారపు బాబు తెలిపారు. ఈ ఎంపికై న జట్టు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈనెల 25నుంచి 28వ తేదీవరకు జరగనున్న పారా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
రేపు కాజీపేట మీదుగా వన్‌వే స్పెషల్ ట్రైన్


