కార్మికుల ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలి
భూపాలపల్లిలోని కృష్ణకాలనీ, సుభాష్‌కాలనీల్లోని సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం పట్టాలు అందించాలి. కొత్తపల్లిగోరితో పాటు పలు గ్రామాల్లో రైతుల భూములకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పట్టాలు అందించాలి. కొత్తపల్లిగోరి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల రైతులకు డీఎండీ 38 ద్వారా దేవాదుల నుంచి సాగు నీరు అందించాలి. సింగరేణి డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
– గండ్ర సత్యనారాయణరావు,
ఎమ్మెల్యే


