రైల్వే పోలీసుల అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

రైల్వే పోలీసుల అప్రమత్తం

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

రైల్వ

రైల్వే పోలీసుల అప్రమత్తం

డోర్నకల్‌: దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో గురువారం డోర్నకల్‌లో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్పీఎఫ్‌ ఏఎస్సై శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌తో పాటు స్టేషన్‌ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లోని పలు ప్లాట్‌ఫారాలపై ప్రయాణికుల రాకపోకలను నిశితంగా పరిశీలించారు.

కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం : ఎమ్మెల్యే

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌, కేసముద్రం మున్సిపాలిటీలపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలు డబ్బుకు, పేదరికానికి మధ్య జరిగిన యుద్ధమని అభివర్ణించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నేతలు దోచుకుని, దాచుకున్న డబ్బులను విచ్చలవిడిగా వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. కాంగ్రెస్‌, సీపీఎం అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధిస్తారని, కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలే గెలిపి స్తాయన్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో నేతలు పాలనను గాలికివదిలేసి తమ స్వీయ ప్రయోజనాలకే అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా తీర్పు వెల్లడించనున్నారని, స్థానికంగా తమకు అందుబాటులో ఉండేవారినే ప్రజ లు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేసముద్రం మున్సిపాలిటీలో రూ.86 కోట్లలతో రహదారులు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, మురు గు కాల్వల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మహబూబాబాద్‌ మున్సిపాలిటీలోని 36 వార్డులకుగాను 26 వార్డుల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కేసముద్రంలో 16 వార్డులకుగాను 12 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా, డీసీసీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌ చందర్‌ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌, సీపీఎం నేతలు సూర్నపు సోమయ్య, దేవరం ప్రకాశ్‌రెడ్డి, అజ్మీరా సురేష్‌, గునిగంటి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

తొర్రూరు: తొర్రూరు బస్‌ డిపో పరిధిలో నేడు (శుక్రవారం) ఉదయం 11నుంచి 12 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం పద్మావతి గురువారం తెలిపారు. వివిధ మార్గాల్లో కొత్త బస్సు సర్వీసుల కేటాయింపు, వేళపాళల్లో మార్పులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు, సంస్థ ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలపై ప్రజలు నేరుగా తమ సూచనలు, సలహాలు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఆసక్తిగలవారు 99592 26053 నంబర్‌లో నిర్ణీత సమయంలో ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

పూర్తి కావస్తున్న జాతర ఏర్పాట్లు

కురవి: మండల కేంద్రంలో మహాశివరాత్రి నుంచి జరగబోయే భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతర పనులు పూర్తి కావస్తున్నాయి. గురువారం ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రునాయక్‌ జాతర పనులను పరిశీలించారు. నాగేంద్రస్వామి ఆలయంలో జరిగిన బారికేడ్ల పనులు, కల్యాణవేదిక, కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు ఆవరణలో కూర్చునేందుకు చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల ను ఆదేశించారు. మానుకోట డీఎస్పీ తిరుపతిరావు, మానుకోట రూరల్‌ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై సతీష్‌ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లను పరిశీలించారు. శివరాత్రి రోజున భక్తుల దర్శనాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఆలయ సిబ్బంది బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే స్వామి, అమ్మవార్ల ఆభరణాలను శుభ్రం చేశారు. ఆలయం, సత్రాలకు విద్యుత్‌ దీపాల ఏర్పాట్లు, ఆలయ తూర్పు ద్వారం నుంచి కల్యాణ మండపం వరకు మెయిన్‌రోడ్డుపై కలకత్తా పెండల్స్‌ ఏర్పాటు చేశారు.

రైల్వే పోలీసుల అప్రమత్తం
1
1/2

రైల్వే పోలీసుల అప్రమత్తం

రైల్వే పోలీసుల అప్రమత్తం
2
2/2

రైల్వే పోలీసుల అప్రమత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement