శ్రీకాంత్‌రెడ్డి, విజయకాంత్‌ రెడ్డిలకు పితృ వియోగం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌రెడ్డి, విజయకాంత్‌ రెడ్డిలకు పితృ వియోగం

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

శ్రీక

శ్రీకాంత్‌రెడ్డి, విజయకాంత్‌ రెడ్డిలకు పితృ వియోగం

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన సంవిధాన్‌ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్‌ రెడ్డి, బిగ్‌ టీవీ చైర్మన్‌ వెన్నం విజయకాంత్‌ రెడ్డిల తండ్రి రాఘవేందర్‌ రెడ్డి (79) అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాఘవేందర్‌ రెడ్డి మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబునాయుడు ఎక్స్‌ ద్వారా సంతాపం తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ జాటోత్‌ రామచంద్రునాయక్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ భూ క్య మురళీనాయక్‌, యశస్వినిరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్‌ భూక్య ఉమ, మాజీ డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌ చందర్‌ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు రాఘవేందర్‌ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఉలుపాల ప్ర భాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీలు మాలోత్‌ కవిత, అజ్మీరా సీతా రాంనాయక్‌, మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌, డాక్టర్‌ సీతామహాలక్ష్మి, ఘనపురపు అంజయ్య, చౌడవరపు మోహన్‌ రావు, గోపాల్‌ ఝ వార్‌, కేఎస్‌ఎన్‌.రెడ్డి, పర్కాల శ్రీనివాసరెడ్డి, రావుల రవిచందర్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, మా అసోసియేషన్‌ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం, అంబటి వీరభద్రం, టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కొండపల్లి రామచంద్రరావు తదితరులు రాఘవేందర్‌ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనారోగ్యంతో రాఘవేందర్‌ రెడ్డి కన్నుమూత

తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

శ్రీకాంత్‌రెడ్డి, విజయకాంత్‌ రెడ్డిలకు పితృ వియోగం1
1/1

శ్రీకాంత్‌రెడ్డి, విజయకాంత్‌ రెడ్డిలకు పితృ వియోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement