నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఖిలా వరంగల్ : 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 11, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతగా జరిగింది. నగరంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో మొత్తం 2,486 మందికి 1,590 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 896 మంది గైర్హాజరయ్యారు. 11వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, 9వ తరగతి పరీక్ష ఉదయం 11.15 నుంచి1.45 గంటల వరకు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ పూర్ణిమ తెలిపారు. 9వ తరగతికి 173 మంది బాలికలు, 373 మంది బాలురు హాజరుకాగా.. 11వ తరగతి పరీక్షకు 350 మంది బాలికలు, 694 మంది బాలురు హాజరైనట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగడానికి కృషి చేసిన జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
11 కేంద్రాల్లో నిర్వహణ
మొత్తం 2,486 మందికి
1,590 మంది హాజరు
896 మంది గైర్హాజరు


