ఫైనల్‌కు చేరిన అండర్–19 క్రికెట్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్–19 క్రికెట్ పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి. నగర శివారులోని మొగిలిచర్ల క్రికెట్ మైదానంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో మెదక్, వరంగల్ జట్లు తలపడ్డాయి. ఇందులో 51 పరుగుల తేడాతో మెదక్ జట్టు విజయం సాధించింది. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ మైదానంలో జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్, ఖమ్మం జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన పోరులో ఖమ్మం జట్టుపై 57 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది. నేడు (శనివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో మెదక్ జట్టు, కరీంనగర్ జట్లు తలపడుతాయని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.


