సమ్మక్క–సారలమ్మా.. మీరే దిక్కు
హన్మకొండ కల్చరల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపులో కోరికల లేఖలు ఆసక్తి కలిగిస్తున్నాయి. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు మంగళవారం ఆరో రోజు కొనసాగింది. లెక్కింపులో లభ్యమవుతున్న భక్తుల కోరికల లేఖలు సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కరెన్సీ కట్టలకు సమాంతరంగా వింత వింత కోరికలు చూసి అంతా లేఖలు చదవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఓ భక్తుడు ఉద్యోగం కోసమైతే.. ఇంకో భక్తుడు ఏకంగా నలుగురు పిల్లలకు ఉద్యోగాలు రావాలని, సెట్ అవ్వాలని యాటను ఇస్తానని కోరారు. మరొకరు కొడుకు పుట్టాలని కోరుకుంటున్న లేఖలు హుండీలో కనిపించాయి. అంతే కాదు ఒక భక్తుడు వ్యాపారంలో రాణించాలని, అప్పులు తీరాలని, ఆరోగ్యం బాగుండాలని, అలాగే మా దంపతులకు కొడుకు పుట్టాలని.. అమ్మవారికి విన్నవించుకున్నాడు.
● మేడారం హుండీ కానుకల్లో
కోరికల లేఖలు
● ఉద్యోగం కోసం ఒకరైతే,
కొడుకు పుట్టాలని మరొకరు


