వినతులను సత్వరమే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతులను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గడువులోపే వినతులను పరిష్కరించాలని లేని యెడల కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. పెండింగ్ వినతులను కూడా పరిష్కరించాలన్నారు. డ్రెయినేజీలు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై వచ్చిన వినతుల విషయంలో తక్షణమే స్పందించాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 131 వినతులు వచ్చిన్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సీపీఓ శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి
ఏపూర్ గ్రామంలో నాకు ఎకరం రెండు గుంటల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నా.. తహసీల్దార్ పాస్ పుస్తకం ఇవ్వడం లేదు. ఆర్డీఓను కలిసినా పని కాలేదు. కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌ను పలు మార్లు కలిసినా ఫలితం లేదు. అందుకే పాస్‌పుస్తకం మంజూరు చేయాలని ప్రజావాణిలో వినతి ఇచ్చాను.
– వాంకుడోత్ లక్‌పతి,
ఏపూర్ గ్రామం, పెద్దగూడూరు మండలం
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
ప్రజావాణిలో 131 దరఖాస్తుల స్వీకరణ
వినతులను సత్వరమే పరిష్కరించాలి


