మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
సాక్షి, మహబూబాబాద్: మారుమూల మానుకోట జిల్లాలోని నాయకులు అవకాశమున్న ప్రతీసారి ఇటు శాసన మండలి, అటు రాజ్యసభ సీటుకోసం ప్రయత్నాలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా రాష్ట్ర కోటాలోని రాజ్యసభ సీటుకోసం జిల్లా నుంచి ఇద్దరు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేతలు వేర్వేరు సామాజిక వర్గాల నుంచి ప్రయత్నం చేస్తుండడంతో ఇద్దరూ పెద్దల సభకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
గతంలో ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేరైన తర్వాత మహబూబాబాద్ జిల్లాకు చెందిన నాయకులు శాసనన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. గతంలో రాథోడ్ సత్యవతి ఎమ్మెల్సీగా ఎన్నికై కేసీఆర్ మంత్రివర్గంలో రాష్ట్రమంత్రిగా పనిచేశారు. అదే విధంగా జిల్లాకు చెందిన సీనియర్ బీఆర్‌ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీరిద్దరితోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పింగిలి శ్రీపాల్‌రెడ్డి కూడా మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. అదే విధంగా జిల్లాలోని ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ బీఆర్‌ఎస్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర రెండో సారి రాజ్యసభకు నియమితులయ్యారు.
పాదయాత్రతో చేరువై..
జిల్లా నుంచి లంబాడ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన గూడూరు ప్రాంతానికి చెందిన తేజావత్ బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నారు. గిరిజన సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడంలో కీలకపాత్ర పోషించారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో కీలకంగా పనిచేసి గాంధీ కుటుంబానికి దగ్గరయ్యారు. రాజ్యసభ సీటుకోసం ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉండి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో ఎస్టీ కోటాలో బెల్లయ్యనాయక్‌కు రాజ్యసభ సీటు వచ్చే అవకాశాలు లేకపోలేదని స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చ.
ముఖ్యమంత్రి మిత్రుడిగా..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రయత్నించిన కీలక నాయకుల్లో ఒకరిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి ప్రస్తుతం సీఎం సలహాదారులుగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సమీప మిత్రుడిగా ఈయనకు పేరుంది. గతంలో నేరుగా పోటీ చేసేందుకు సిద్ధమైనా.. రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ప్రత్యక్ష ఎన్ని కల్లో పోటీకి దిగలేదు. అయితే శాసనమండలి సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి నియామకం దాదాపుగా పూర్తయిందనే వార్తలు వచ్చిన తర్వాత చివరి నిమి షంలో చేజారిపోయింది. కాగా, ముఖ్యమంత్రి మిత్రుడిగా ఉంటూనే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు విధేయుడిగా నరేందర్‌రెడ్డి పేరు సంపాదించుకున్నారు. కావున.. ఇప్పుడు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు సీఎం, ఇతర కీలక మంత్రులు కూడా వేం నరేందర్ రెడ్డి పేరు సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
జిల్లా నుంచి ఇద్దరు నాయకుల పోటీ
అనుకూలించే అవకాశం ఉందని చర్చ
ఎస్టీ కోటాలో బెల్లయ్యనాయక్, జనరల్ కోటాలో వేం నరేందర్ రెడ్డి
ఇద్దరికా.. ఒకరికా..?
రాజ్యసభకు పోటీ పడుతున్నవారిలో ఇద్దరు నాయకులు జిల్లాకు చెందిన వారే కావడంతో వారు రాజ్యసభకు ఎంపికై తే జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు సైతం రాజ్యసభ సీటు కోసం తీవ్రప్రయత్నాలు చేసుకుంటున్న నేపథ్యంలో మానుకోట జిల్లా నుంచి ఇద్దరికీ అవకాశం ఇస్తారా.. ఒకరికి ఇస్తారా.. అనేది వేచి చూడాలి.
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


