‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

Feb 21 2026 7:38 AM | Updated on Feb 21 2026 7:38 AM

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: మైనార్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులకు స్టడీ అవర్స్‌ ఏర్పాటు చేయాలని, నాణ్యమైన డైట్‌ మెనూ పాటి ంచాలన్నారు. ప్రత్యేక అధికారులు మండలాల వా రీగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు తనిఖీ చేసి ఉత్త మ ఫలితాలు సాధించడం కోసం వార్డెన్లు, ప్రిన్సిపాల్స్‌కు తగిన సూచనలు చేయాలన్నారు.

ఉత్తమ ఫలితాలే ముఖ్యం..

కురవి: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటగదిని పరిశీలించారు. కంప్యూటర్‌ తరగతులు అభ్యసిస్తున్న విద్యార్థినులను పరిశీలించారు. స్టడీ అవర్స్‌ను పెంచాలని సూచించారు. నాణ్యమైన మెనూ పాటించాలని, పిల్లలకు షెడ్యూల్‌ ప్రకారం ఆరోగ్య పరీక్షలు చేయి ంచాలని తెలిపారు. తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలన్నారు. పిల ్లలకు డిజిటల్‌ తరగతులను అర్థమయ్యే రీతిలో బోధించాలని తెలిపారు. హెచ్‌డబ్ల్యూఓ సునీత, హెచ్‌ఎం బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement