నేడు రథోత్సవం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు(శుక్రవారం) రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచి అభిషేక పూజలు, బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటల తర్వాత రథోత్సవ పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేసి గ్రామసేవకు తీసుకెళ్తారు. రథోత్సవానికి ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు.
బలహీన వర్గాల
అభివృద్ధికి కృషి
బయ్యారం: రాష్ట్రప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం బడు గు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలన్నారు. అనంతరం బయ్యారంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ దీపిక, సర్పంచ్ ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అంతరాయం లేకుండా చర్యలు
తొర్రూరు: వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్, చీఫ్ జనరల్ మేనేజర్ రాజు చౌహాన్ అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని మరమ్మతుల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నామన్నారు. రంజాన్ మాసంలో సైతం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
రంజాన్ మాసంలో
నిరంతర విద్యుత్
నెహ్రూసెంటర్: రంజాన్ మాసం సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పి.విజేందర్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని మసీదులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగకుండా చూడాలన్నారు.
రాష్ట్రస్థాయి సెమినార్‌కు కల్వల హెచ్‌ఎం
కేసముద్రం: స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థా యి గణిత సెమినార్‌లో మండలంలోని కల్వల గ్రామ జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం బండారు నరేందర్ మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకంలో ఉపయోగించే గణిత సూత్రాలను అన్వయిస్తూ విద్యార్థులకు గణితాన్ని నిత్య జీవితా నికి అనుసంధానం చేసి, విశ్లేషణాత్మక దృష్టిని పెంపొందించే వినూత్న ప్రయత్నంలో భాగంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్‌ఎం బండారు నరేందర్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.
నేడు రథోత్సవం
నేడు రథోత్సవం


