అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా | - | Sakshi
Sakshi News home page

అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

అన్ని

అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా

మరిపెడను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వీసారపు ప్రగతి

మరిపెడ: ‘ప్రజలు నన్ను రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిపించారు. మొదటిసారి నా వంతుగా వార్డు అభివృద్ధికి పాటుపడిన. ఈసారి 8వ వార్డు నుంచి గెలుపొంది చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యా. ముందుగా వార్డు ప్రజలకు రుణపడి ఉంటా. అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా’ అని మరిపెడ చైర్‌పర్సన్‌ వీసారపు ప్రగతి ‘సాక్షి’తో ప్రత్యేకంగా తెలిపారు. వివరాలు ఆమె మాటల్లోనే..

అందరిని కలుపుకుని వెళ్తా..

మున్సిపాలిటీలోని 15వార్డులను అభివృద్ధి చేసి చూపిస్తా. అన్నీ వీధులు తిరిగి సమస్యలు గుర్తించి ఒక్కొక్కటిగా విడతల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తా. 30ఏళ్లుగా పాఠశాల నడుపుతూ అందరికీ విద్యాబుద్ధులు నేర్పించిన కుటుంబం మాది. స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ సహకారంతో మరిపెడను మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాటుపడుతా. అన్ని పార్టీల నాయకుల మద్దతు తీసుకుంటూ అందరి సలహాలతో మరిపెడ పట్టణాన్ని జిల్లాలోనే ఆదర్శంగా నిలబెడుతా.

సుందరీకరణ కోసం పాటుపడుతా..

మున్సిపాలిటీలోని అన్ని వీధుల్లో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థతో పాటు సుందరీకరణ పనులు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసి పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తా. పర్యావరణాన్ని కాపాడేందుకు పచ్చదనం పెంపునకు కృషి చేస్తా. పట్టణ కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తా. తాగునీటి విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నేరుగా పర్యవేక్షణ చేపడుతా.

అభివృద్ధికి అందరూ సహకరించాలి..

మరిపెడ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని వర్గాల సహకారం ఎంతో అవసరం. కార్యవర్గ సమావేశంలో అన్ని పార్టీల కౌన్సిలర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆమె కోరారు.

చైర్‌పర్సన్‌ ప్రొఫైల్‌

పేరు: వీసారపు ప్రగతి

వృత్తి: గృహిణి

భర్త: శ్రీపాల్‌రెడ్డి

విద్య: ఇంటర్మీడియట్‌

పిల్లలు: ఒక కూతురు, కుమారుడు

పుట్టిన ఊరు: పెద్దనాగారం

అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా1
1/1

అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement