సీహెచ్‌సీని సందర్శించిన కాయకల్ప వైద్యబృందం | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌సీని సందర్శించిన కాయకల్ప వైద్యబృందం

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

సీహెచ్‌సీని సందర్శించిన కాయకల్ప వైద్యబృందం

సీహెచ్‌సీని సందర్శించిన కాయకల్ప వైద్యబృందం

గార్ల: స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో సకల సౌకర్యాలు ఉన్నాయని, సరిపడా వైద్యులు లేకపోవడంతో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించలేకపోతున్నారని కాయకల్ప వైద్య బృందం తని ఖీలో గుర్తించింది. గురువారం మహదేవపూర్‌ సీహెచ్‌సీ నుంచి కాయకల్ప వైద్యబృందం స్థానిక సీహెచ్‌సీని సందర్శించి ఆస్పత్రిలోని సమస్యలను గుర్తించింది. ఆస్పత్రిలో కిందిస్థాయి వైద్యసిబ్బంది సరిపడా ఉన్నారని, స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత ఉందన్నారు. బృందం సభ్యులు ఆస్పత్రిలో వార్డులు తిరిగి వైద్యసేవలు ఎలా ఉన్నాయని రోగులను అడి గి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్లకు అందించే భోజనంలో నాణ్యతను పరిశీలించారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు, మందుల నిల్వ గదిని పరి శీలించారు. తుది నివేదికను కేంద్ర వైద్య బృందానికి సమర్పిస్తామని వైద్యబృదం మెడికల్‌ సూపర్‌వైజర్‌ విద్యావతి, హెడ్‌నర్సు బాలామణి, స్టాఫ్‌ నర్స్‌ గీత, సూపర్‌వైజర్‌ ఉదయ్‌కుమార్‌ పేర్కొన్నారు. వారివెంట సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌గౌడ్‌, డాక్టర్‌ సతీష్‌, హెడ్‌ స్టాఫ్‌నర్స్‌ స్వాతి, స్టాఫ్‌నర్సులు రాణి, మెర్సీ, ఆశాలత, వినీల, సరిత, రజిని, పుష్పలత, ఎంఎన్‌ఓ శ్రీని వాస్‌, ఫార్మసిస్ట్‌ జ్యోతి, దేవరాజ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement