సబ్‌స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

Feb 25 2026 9:45 AM | Updated on Feb 25 2026 9:45 AM

సబ్‌స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

సబ్‌స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

హన్మకొండ: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో చేపడుతున్న 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్‌ రెడ్డి అధ్యక్షతన స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో చేపడుతున్న విద్యుత్‌ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుతో రిజ ర్వాయర్లలోకి నీరు రావడంతో పంటల దిగుబడి పెరిగిందన్నారు. సాగరం, కొండాపూర్‌, కుర్చపల్లి సబ్‌ స్టేషన్లు మార్చి నెలాఖరు వరకు చార్జీ చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సీఎండీ వరుణ్‌ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం వినూ త్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ప్రమాదకరంగా ఉన్న లొకేషన్లు గుర్తించి వాటిని మార్చుతున్నామని చెప్పారు. డైరెక్టర్లు వి.మోహన్‌ రావు, టి.మధుసూదన్‌, సి.ఈలు రాజు చౌహాన్‌, సురేందర్‌, ట్రాన్సో కో వరంగల్‌ జోన్‌ సి.ఈ శ్రీరామ్‌ కుమార్‌, జనగా మ, హనుమకొండ ఎస్‌ఈలు సంపత్‌ రెడ్డి, పి.మధు సూదన్‌ రావు, డి.ఈలు లక్ష్మీనారాయణ రెడ్డి, సార య్య, విజేందర్‌ రెడ్డి, మల్లికార్జున్‌, విజయ కుమార్‌, అనిల్‌ కుమార్‌, సంపత్‌ రావు, ఏడీఈ రణధీర్‌ రెడ్డి, సుధాకర్‌, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement