అతి చేస్తున్న పోలీసులను వదలిపెట్టం
తొర్రూరు: ప్రస్తుతం అతిచేస్తున్న పోలీసులను వది లిపెట్టే ప్రసక్తే లేదని తమ ప్రభుత్వం వచ్చిన త ర్వాత అలాంటివారికి గుణపాఠం తప్పదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జనగామ జి ల్లా తొర్రూరులోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, మహిళల సమస్యలను వదిలిపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు, కమీ షన్ల కోసం కొట్లాడుతున్నారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, అభివృద్ధి పనులు ఏమి చేపట్టాల ని ఆలోచనతో పాలన సాగించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యాంగా న్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. అతి చేస్తున్న పోలీసులను గుర్తిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనే ఉన్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు బీఆర్‌ఎస్ పార్టీ గెలిచినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు, వైస్ చైర్మన్లను చేసుకోవడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ లీగల్‌సెల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని, త్వరలో ఆయా ము న్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండాలు ఎగిరేయడం ఖాయమన్నారు. అనంతరం తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లను ఘనంగా సత్కరించారు. సమావేశంలో మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు..
మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


