సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
గార్ల: ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని, విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించేందుకు ఇక్కడి సీసీ కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి మలిశెట్టి కుమార్ తెలిపారు. మంగళవారం గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష హాళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో మాస్ కాపీయింగ్‌ను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. ఈనెల 25నుంచి మార్చి 16వతేదీ వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 5నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తామని, ఆతర్వాత అనుమతి లేదన్నారు. గార్ల కళాశాల సీఎస్ ప్రసాదరావు, డీఓ నవీన్‌కుమార్, అధ్యాపకులు వేముల రవీందర్, జోగ్యానాయక్, నాగేశ్వరరావు ఉన్నారు.


