21నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

21నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్‌

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

21నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్‌

21నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్‌

వరంగల్‌ మార్కెట్‌ కార్యదర్శి మల్లేశం

వరంగల్‌: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలోని సీసీఐ కేంద్రాల్లో ఈనెల 21వ తేదీ(శనివారం) నుంచి పత్తి కొనుగోళ్లు బంద్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ ఉన్న త శ్రేణి కార్యదర్శి మల్లేశం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం పత్తి కొనుగోళ్లను 20వ తేదీ వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. 21వ తేదీ నుంచి కొనుగోళ్లను నిలిపివేస్తున్నామని సీసీఐ తెలిపిందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఆయన పేర్కొన్నారు.

కళాశాల మైదానంలో

విద్యార్థుల ఘర్షణ

నెల్లికుదురు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాల మైదానంలో బుధవారం విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ప్రత్యక్షుల వివరాల ప్రకారం.. కళా శాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి అదే కళాశాలలోని ఓ విద్యార్థి తరచూ మెసెజ్‌లు పంపుతూ ఇబ్బంది పెడుతున్నాడనే అనుమానంతో ఆ విద్యార్థిని అన్నతోపాటు కొంతమంది కళాశాలకు వచ్చారు. మెసెజ్‌లు పంపుతున్న విద్యార్థి తరఫున కొంతమంది బయటి విద్యార్థులు కూడా చేరుకున్నారు. ఈ సమయంలో మాటామా టా పెరిగి ఒకరినొకరు ఘర్షణ పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెండు వర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కళాశాల యంత్రాంగం చోద్యం చూసిందని ప్రత్యక్షులు విమర్శించారు. కళాశాలలో వీడ్కోలు సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement