అశోక్ కుటుంబానికి అండగా ఉంటాం
హన్మకొండ చౌరస్తా: కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి హనుమకొండ యాదవనగర్‌లోని 4వ డివిజన్ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ అశోక్‌యాదవ్ ఇంటికి వెళ్లారు. యువకుడిపై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న బొంగు అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్ భార్య అనిత, కుమారుడు అఖిల్.. హరీశ్‌రావు ఎదుట బోరున విలపించారు. స్థానిక యువకులు రఘు, లక్ష్మణ్ ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే అశోక్‌యాదవ్ ప్రశ్నించారని, ఆ విషయం మనసులో ఉంచుకుని టార్గెట్ చేశారని వెల్లడించారు. నాన్న పై దాడి చేస్తే తాము పిటిషన్ ఇవ్వగా పోలీసులు తీసుకోలేదని అఖిల్ తెలిపారు. దీనిపై హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెడుతోందని, బాల్క సుమన్, బొంగు అశోక్‌ది అక్రమ అరెస్ట్ అన్నారు. వారి వెంట బీఆర్‌ఎస్ 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్‌కుమార్, స్థానిక నాయకులు ఉన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు


