ఉత్తమ ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఫలితాలు సాధించాలి

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

ఉత్తమ ఫలితాలు  సాధించాలి

ఉత్తమ ఫలితాలు సాధించాలి

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. మహబూబాబాద్‌ మండలంలోని పర్వతగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధన తీరుతెన్నులను స్వయంగా పరిశీలించారు. నూతన టెక్నాలజీ, ఏఐ, డిజిటల్‌ తరగతుల ద్వారా విద్యా బోధన చేయాలని సూచించారు. పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు శాతం పక్కాగా ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన మెనూ అమలు చేయాలని, హెల్త్‌, ఎడ్యుకేషన్‌, న్యూట్రీషియన్‌పై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలను తనిఖీ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement