– హన్మకొండ కల్చరల్‌ | - | Sakshi
Sakshi News home page

– హన్మకొండ కల్చరల్‌

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

– హన్

– హన్మకొండ కల్చరల్‌

ఇష్టంగా నేర్చుకోవాలి..

సంగీతంలో మత్తు ఉంది. అంతు చిక్కని మహత్తు ఉంది. వ్యాధులను నయం చేసే గుణం ఉంది. మనసును తేలిక చేసే మహత్యం ఉంది. చరిత్రలో ఆ మహిమతో కొందరు జీవిత సారం తెలుసుకున్నారు. సరిగమలతో మరికొందరు భవ సాగరం దాటారు. అంతటి ప్రాధాన్యమున్న కళలో రాణించేందుకు బాల్యంలో ఆసక్తి ఉండి నేర్చుకోనివారు.. నేర్చుకుందామన్నా.. అవకాశాలు రాని వారు.. జిజ్ఞాసను నెరవేర్చుకునేందుకు విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల బాటపడుతున్నారు. వృత్తి రీత్యా ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తి కోసం విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి సంగీత పిపాసుల నేపథ్యమే ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ..

‘ఉపాధి’ లక్ష్యాలు పూర్తి చేయాలి

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌

మహబూబాబాద్‌: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ప్రగతిపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ.. లక్ష్యాల్లో వెనుకబడిన మండలాలు వారం రోజులలోపు ఉపాధి హామీ కూలీల హాజరు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ కూలీల సమీకరణ ప్రతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యత అని అన్నారు. ఉపాధి పనుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఉపాధి హామీ పథకంలో మంజూరుచేసిన పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖల ద్వారా జరుగుతున్న పనులన్నీ వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, డీపీఓ హరిప్రసాద్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

‘పారువేట’లో వీరభద్రుడు

గుడి చుట్టూ తిరిగిన ఎడ్లబండి

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం వీరభద్రస్వామి(కల్యాణ వీరభద్రుడు) పారువేట(మృగవేట) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పెనుగొండ అనిల్‌కుమార్‌, తేజశర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంలో స్వామి వారి ఉత్సవమూర్తిని అధిష్టింపజేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం శావపై అర్చకుడు తేజశర్మ నిలుచుని ఉండగా వాహనకారులు శావను మోస్తూ పరుగులు తీశారు. బాదె నాగయ్య బజార్‌ వద్దకు చేరుకున్నాక శావకు గ్రామస్తులు భక్తులు, మహిళలు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి బిందెలతో నీటిని ఆరబోశారు. బజార్‌ పెద్ద బాదె నాగయ్య సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మీరాజునాయక్‌, వార్డు సభ్యుడు ఆమెడమల్లికార్జున్‌, పూజారి అనిల్‌ను, బజార్‌ పెద్దలను సత్కరించారు. కార్యక్రమంలో మామిడి కృష్ణ, తొడుసు ఉమేష్‌, రేషబోయిన వీరన్న, తొడుసు చంటి, చెవుల భరత్‌కుమార్‌, రేషబోయిన నరేష్‌, నిలుగొండ నాగేశ్వర్‌రావు, అనబత్తుల వీరభద్రం, బాదె సోమయ్య, దూదికట్ల నాగేశ్వర్‌రావు, దోర్నం వెంకన్న, కొత్తయాకరాజు, రేషబోయిన రాజు, తొడుసు సోమయ్య, పాశం రాములు, తేనే రమేష్‌, తేనె విక్కి, రచ్చ ఉప్పలయ్య, అప్పాల వెంకన్న, ఆమెడ సత్యం, దోర్నం బిక్షం పాల్గొన్నారు.

నేరడ ఎడ్ల బండికి స్వాగతం..

వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి రాళ్లు మోసిన కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన రుద్రారపు వంశీయుల మూడు జతల ఎడ్ల బండికి ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. ఎడ్ల బండికి పూలదండలు వేసిన అనంతరం ఆలయం చుట్టూ ఎడ్లబండి ప్రదక్షిణలు చేయడంతో బండ్లు తిరిగే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రుద్రారపు వంశీయులు పాల్గొన్నారు.

వరంగల్‌లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సితార్‌

శిక్షణ పొందుతున్న విద్యార్థులు

‘నాకు సంగీతమంటే ఇష్టం. సివిల్స్‌కి సన్నద్ధమయ్యే ముందు కర్నాటక వయోలిన్‌ నేర్చుకున్నా. తర్వాత విధుల్లో బిజీగా ఉంటుండడం వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ సాధన చేస్తున్నా. ఇలా విద్యార్థులతో ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది.

– ఇటీవల హనుమకొండలో జరిగిన

సంగీతోత్సవంలో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

స్వయంగా వయోలిన్‌ ప్రదర్శన ఇచ్చిన

సమయంలో చేసిన వ్యాఖ్యలు.

వారంతా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. పలు హోదాల్లో ఉన్నారు. ఐదారంకెల జీతం తీసుకుంటున్నారు. చుట్టూ సకల సౌకర్యాలున్నాయి.. కానీ, వారిని ఓ వెలితి వెంటాడుతోంది. ఆ జిజ్ఞాసే వారిని కఠోర సాధనకు ఉపక్రమించింది. వీరందరి కళలకు జీవం పోస్తోంది భద్రకాళి ఆలయ ప్రధాన ఆర్చ్‌ సమీపంలోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల. ఇక్కడ శాసీ్త్రయ కూచిపూడి, పేరిణి, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం, కర్ణాటక వయోలిన్‌, సితార్‌, తబలావంటి శిక్షణ ఇస్తున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడం.. విద్యార్థుల్లో కళలపై ఆసక్తి పెంచడం.. వివిధ కళల్లో శిక్షణ ఇచ్చి విశిష్టతను చాటి చెప్పడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడ శిక్షణ పొంది శాసీ్త్రయ కళల్లో రాణిస్తున్నారు. ఈ కళాశాలలో 10 ఏళ్ల బాలల నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో సంగీత, నృత్య అధ్యాపకులు ప్రిన్సిపాల్‌ యన్‌.సుధీర్‌కుమార్‌.. ఇదే కాలేజీలో సరిగమలు పలికిన విద్యార్థి కావడం విశేషం.

సంగీతం శ్యాసకు వ్యాయామం

నేను కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందుతున్నా. సంగీతం శ్వాసకు వ్యాయామం వంటిది. ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం సంగీతం క్లాస్‌కు వెళ్తాను. సంగీతం మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. పనిఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో కుటుంబ బంధాలు మెరుగుపడుతాయి. విశ్వాసం, శాంతి పెరుగుతుంది.

– డాక్టర్‌ జ్యోతి హరికీర్తి, మెడికల్‌ ఆఫీసర్‌ అనంతలక్ష్మి వైద్య కళాశాల, వరంగల్‌

అలసటను పారదోలే మార్గం..

ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నా. అలసట నివారణకు సంగీతం సహాయపడుతుంది. ప్రశాంత సంగీతం కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్‌)ను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆధ్మాత్మికత, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది. కచేరీలు, ప్రదర్శనల ద్వారా సమాజం పరిచయమవుతుంది.

– గాట్ల భార్గవి, మెడికో, కాకతీయ వైద్య కళాశాల

యువతకు, పెద్దవారికి సంగీతం, నృత్య కళలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు చేస్తూ.. సాయంత్రం వేళలో హాజరవుతున్నారు. కళల్లో రాణించాలంటే ఇష్టంగా నేర్చుకోవాలి. మా నాన్న నౌడ్గడ హనుమంతరావు ఇక్కడ అధ్యాపకులుగా బోధించారు. నేను ఇక్కడే వయోలిన్‌ వాయిద్యం కోర్సులో శిక్షణ పొందాను. ప్రస్తుతం నేను కళాశాలకు 11వ ప్రిన్సిపాల్‌ని కావడం సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది విదేశాల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు. మరికొందరు గురుకులాల్లో ఉద్యోగాలు పొందారు.

– నౌడ్గడ సుధీర్‌కుమార్‌, విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌

కల నెరవేరింది..

పాఠశాలలో స్పోర్ట్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నా. 12 ఏళ్ల వయస్సులో పేరిణి నృత్యం నేర్చుకోవాలని ఆసక్తిగా ఉండేది. 30 ఏళ్ల వయస్సులో నేర్చుకునే అవకాశం వచ్చింది. నృత్యం నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కళలు సాంస్కృతిక గుర్తింపు, సంగీత సంప్రదాయాలు వారసత్వం కలిగి ఉంటాయి.

– చెన్నూరు జీవన్‌, స్పోర్ట్స్‌ టీచర్‌

సంగీతంలో జిజ్ఞాసను ప్రదర్శిస్తున్న ఉద్యోగులు

వివిధ రకాల వాయిద్యాల్లో శిక్షణ

మానసిక ప్రశాంతత కోసం ‘కళల’ బాట

విధి నిర్వహణ ముగిశాక సమయం కేటాయింపు

నేర్పుతున్న విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల

– హన్మకొండ కల్చరల్‌ 1
1/7

– హన్మకొండ కల్చరల్‌

– హన్మకొండ కల్చరల్‌ 2
2/7

– హన్మకొండ కల్చరల్‌

– హన్మకొండ కల్చరల్‌ 3
3/7

– హన్మకొండ కల్చరల్‌

– హన్మకొండ కల్చరల్‌ 4
4/7

– హన్మకొండ కల్చరల్‌

– హన్మకొండ కల్చరల్‌ 5
5/7

– హన్మకొండ కల్చరల్‌

– హన్మకొండ కల్చరల్‌ 6
6/7

– హన్మకొండ కల్చరల్‌

– హన్మకొండ కల్చరల్‌ 7
7/7

– హన్మకొండ కల్చరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement