కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
● మరియన్న
మహబూబాబాద్ రూరల్ : కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా ఉద్యా న, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మహబూబాబాద్ మండలం పరిధిలోని ఆయిల్ పామ్, మిరప, కూరగాయల పంటలను మల్యాల కేవీకే ఉద్యానశాస్త్రవేత్త సుహాసిని, ఉద్యాన విస్తరణ అధికారి రమేష్, బిందు సేద్యం ప్రతినిధి ఆగస్టీన్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్ పామ్, పండ్ల తోటల్లో అంతర పంటలుగా, డాబాల మీద, పెరటిలో, ఇంటిముందు, పొలం గట్ల మీద కూరగాయ ల పండించుకోవచ్చని తెలిపారు. వేసవిలో వంగ, దోస, సొర, గోరు చిక్కుడు, బెండ, ఆకు కూరలు, మునగ, షేడ్ నెట్ల కింద టమాట, కీర మొదలైన పంటల సాగు ద్వారా ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. జిల్లాలో 5 వేల ఎకరాలకు పైగా కూరగాయల సాగు చేస్తున్నారని తెలి పారు. కూరగాయల సాగుకు పందిళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీతోపాటుగా ఎకరానికి రూ.10 వే ల విలువైన కూరగాయల నారు అందిస్తున్నారు. సర్పంచ్ ఈశ్వరీశంకర్, మాధవాపురం మాజీ సర్పంచ్ ఇస్లావత్ వెంకన్న, రైతులు పాల్గొన్నారు.


