పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన మిరప | - | Sakshi
Sakshi News home page

పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన మిరప

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

పెరిగ

పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన మిరప

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటల సాగుజోరు కొనసాగుతోంది. గత యాసంగి సాగుతో పోలిస్తే ఈ ఏడాది 40 వేల ఎకరాలు అదనంగా సాగవుతోంది. వానాకాలం పంట ల పనులు పూర్తి చేసిన రైతులు ప్రస్తుతం యాసంగి సాగు పనులు ప్రారంభించారు. జిల్లాలోని రైతులు యాసంగి పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరి, పచ్చజొన్న, పెసర, బొబ్బెర, ఇతర ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. సాధారణంగా యాసంగి సీజన్‌ వేసవి ప్రారంభంలోనే మొదలవుతుంది. దీంతో కొన్నిసా ర్లు సాగునీటికి ఇబ్బంది ఉంటుంది. ఈనేపథ్యంలో రైతులు ఎస్సారెస్పీ జలాల విడుదల, వ్యవసాయ బావులు, బోర్లలో నీటి లభ్యతకు అనుకూలంగా పంటలను సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

మిరపకు కుళ్లుతెగులు..

జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే మిరపకు తెగుళ్లు సోకడంకూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గతేడాది మిరప పంటకు నల్లి, పలు రకాల తెగుళ్లు సోకడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాదిలో 48,036 ఎకరాల్లో మిరప సాగు జరుగగా ఈ ఏడాది 39,859 ఎకరాల్లో మాత్రమే మిరప సాగులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మిరప సాగు చేసిన రైతులు ఆ స్థానంలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అయితే పలువురు రైతులు తక్కువ రోజుల పంటకాలం కలిగిన మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.

పెరిగిన మొక్కజొన్న సాగు..

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 40 వేల ఎకరాలకుపైగా మొక్కజొన్న సాగు పెరిగిందని చెప్పవచ్చు. గత ఏడాది 61,060 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగగా మిరపతోపాటుగా ఇతర పంటల సాగు స్థానాల్లో ఈ ఏడాది యాసంగిలో రైతులు 1,03,774 ఎకరాల మేరకు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఏడాది 42,214 ఎకరాల మేరకు మొక్కజొన్న సాగు పెరిగింది. ఇక వరి విషయానికొస్తే గత ఏడాదిలో 1,50,640 ఎకరాల్లో యాసంగి వరి సాగు జరుగగా ఈ ఏడాది ఇప్పటివరకు 1,36,526 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వరి సాగు మరికొద్ది రోజుల్లో 1.60 లక్షల వరకు పెరగనుందని అధికారుల అంచనా. వరి, మొక్కజొన్నతోపాటు జిల్లాలో పచ్చజొన్నలు 411 ఎకరాల్లో, మినుములు 466 ఎకరాల్లో, బొబ్బెర్లు 1,167 ఎకరాల్లో, పెసర 1,635 ఎకరాల్లో, కందులు 15 ఎకరాల్లో, వేరుశనగ 727 ఎకరాల్లో సాగవుతున్నాయి. యాసంగిలో రైతులు మొక్కజొన్న, ఇతర పంటలతో పాటుగా ఆయిల్‌ పామ్‌, కూరగాయలు, పండ్ల పంటలను సైతం సాగు చేస్తున్నారు.

జిల్లాలో జోరుగా యాసంగి పంటల సాగు

ఆరుతడి పంటలపై రైతుల ఆసక్తి

మరింత పెరగనున్న వరి సాగు విస్తీర్ణం

పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన మిరప1
1/2

పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన మిరప

పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన మిరప2
2/2

పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన మిరప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement