జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
మరిపెడ రూరల్: మరిపెడ మహా త్మగాంధీ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని రాసమల్ల శృతి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అనిత, పీడీ శ్రీలత శనివారం తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగిన అంతర్ జిల్లా సబ్‌జూనియర్ వాలీబాల్ చాంపియన్ షిప్‌లో వరంగల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని ప్రతిభ కనబర్చి జాయతీస్థాయి వాలీబాల్ చాంపియన్ షిప్‌కు తెలంగాణ జట్టులో స్థానం దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్‌లో జరిగే పోటీల్లో శృతి పాల్గొంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.


