అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం
వరంగల్ స్పోర్ట్స్: క్రీడాకారులకు కావాల్సిన వసతులను సమకూరుస్తూ, వారిని అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అతిథులుగా హాజరై క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతు ప్రతిభ ఉండి ప్రోత్సాహం కరువైన క్రీడాకారుల కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో అతిథి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలతోపాటు క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. భవిష్యత్‌లో క్రీడాభివృద్ధికి మరింత కృషిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు సారంగపాణి, గట్టు మహేశ్‌బాబు, డాక్టర్ పింగిళి రమేశ్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీఎస్‌ఏ కోచ్‌లు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
జేఎన్‌ఎస్‌లో సీఎం కప్ రాష్ట్రస్థాయి
అథ్లెటిక్స్ పోటీలు షురూ
అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం


