పాలకులకు మాలలపై కక్ష తగదు
హన్మకొండ: పాలకులకు మాలలపై కక్ష తగదని జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని మాల భవన్‌లో జాతీయ మాలమహానాడు హనుమకొండ జిల్లా కమిటీ సమావేశంలో సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల్లా ఉన్న మాల మాదిగలను వర్గీకరణ పేరుతో విడగొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో నష్టపోతున్నామని మాలలు గొంతెత్తడంతో రోస్టర్ విధానాన్ని జీఓ 99 ద్వారా తీసుకువచ్చి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు మాలలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్ర అన్యాయానికి ప్రభుత్వం గురి చేసిందన్నారు. మాలల గొంతుకగా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అసెంబ్లీలో మాట్లాడడం హర్షణీయమన్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో అగ్రవర్ణ వర్గాల కుల అహంకారానికి బలైన చిన్నారికి నివాళులర్పించారు. సమావేశంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, నాయకులు నీరకి రాము, బన్ను సాంబయ్య, బొల్లం రాంకుమార్, పనికల శ్రీనివాస్, సంపతి రఘు, పాడుగుల నర్సయ్య, గొర్రె రమేష్, మల్లం రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ మాలమహానాడు
రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్


