రాత్రివేళ అందని వైద్యసేవలు
డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటల వైద్య సేవలు అందడం లేదు. రాత్రి వేళ ఆస్పత్రిలో వైద్యులు ఉండడం లేదు. స్టాఫ్‌నర్సు మాత్రమే రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వారికి ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. దీంతో చాలామంది రాత్రివేళ పీహెచ్‌సీకి వెళ్లకుండా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. డోర్నకల్‌లో ప్రైవేట్ ఆస్పత్రి లేకపోవడంతో రాత్రి వేళ ఖమ్మం వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– గాజుల వేణుగోపాల్, నెహ్రూ స్ట్రీట్, డోర్నకల్
రోగులకు ఇబ్బంది అవుతుంది
గతంలో గంగారం ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉండేవారు. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా వైద్యం అందించేవారు. కానీ ఇప్పుడు ఒక్క డాక్టరే వస్తున్నారు. అదీ కూడా మధ్యాహ్నం తర్వాత ఉండడం లేదు. నర్సులు మాత్రమే ఉంటున్నారు. డాక్టర్లను నియమించి నిరంతరం వైద్య సేవలు అందేలా చూడాలి.
– బెజ్జరి, వెంకటయ్య, గంగారం
రాత్రివేళ అందని వైద్యసేవలు


