వేసవిలో తోటలకు జాగ్రత్తలు తీసుకోవాలి
● మహబూబాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న
మహబూబాబాద్ రూరల్ : వేసవి కాలంలో పండ్లు , కూరగాయల తోటలకు నష్టం వాటిళ్లకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. ఈమేరకు బుధవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పంటలను పరిశీలించి రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. మామిడి, జామ, నిమ్మ, సపోటా, సీతాఫల్, పనస, నేరేడు, అవకాడో పండ్ల తోటల్లో మల్చింగ్, బిందు సేద్యం ద్వారా నీరు ఇవ్వాలన్నారు. లేత తోటల చుట్టూ జీలుగ, జనుము, అవిసె విత్తుకోవడం, కాయలకు ఫ్రూట్ బ్యాగింగ్ చేయడం, అంతర పంటల సాగు, వర్మి కంపోస్ట్ వాడకం, లేత చెట్లను విడివిడిగా షేడ్ నెట్‌తో కప్పాలన్నారు. అలాగే, డ్రాగన్ ఫ్రూట్, అరటి, బొప్పాయి, కూరగాయలు, పుచ్చ, మల్బరీ తోటల్లో ఈ విధానాలే పాటించాలన్నారు.
వేసవిలో తోటలకు జాగ్రత్తలు తీసుకోవాలి


